12న దేశవ్యాప్త సమ్మె

posted on: Feb 10, 2026 11:47AM

కేంద్రంలోని మోడీ సర్కార్ అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 12న దేశ వ్యాప్త సమ్మె జరగనుంది. ఈ సమ్మెకు దేశంలోని పది ప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక పిలుపు నిచ్చింది. ఈ సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా 600కు పైగా జిల్లాల్లో తీవ్రంగా ఉంటుందని కార్మిక సంఘాల ఐక్యవేదిక పేర్కొంది.

కేంద్ర  ప్రభుత్వ  కార్మిక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ ఈ సమ్మెకు పిలుపు నిచ్చినట్లు తెలిపింది.  ప్రధానంగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ఉపాధి హామీ పథకంలో మార్పులను వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లతో ఈ సమ్మెకు పిలుపు నిచ్చినట్లు తెలిపింది.  

గత జులైలో జరిగిన దేశవ్యాప్త సమ్మెలో పాతిక కోట్ల మంది పాల్గొన్నారనీ, ఈ సారి ఫిబ్రవరి 12 (గురువారం) జరగనున్న దేశ వ్యాప్త సమ్మెలో అంతకంటే ఎక్కువగా దాదాపు 30 కోట్ల మంది పాల్గొననున్నారనీ కార్మిక సంఘాలు తెలిపాయి. ఈ సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా సహా పలు రైతు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...