ఈ సన్నని సముద్ర మార్గాలు.. అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రాణవాయువు!

posted on: Apr 16, 2026 4:38PM

ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్యంలో సింహభాగం అంటే దాదాపు 80 శాతం పైగా సముద్ర మార్గాల ద్వారానే సాగుతోంది. అయితే, భూగోళంపై ఉండే కొన్ని అత్యంత ఇరుకైన సముద్ర మార్గాలు.. వాటిలో చోక్ పాయింట్స్ అంటారు. ఆ చోక్ పాయింట్లే ఇప్పుడు  ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మార్గాల్లో తలెత్తే అతిచిన్న   లోపం లేదా యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసే  ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా అమెరికా ప్రాబల్యం ఎక్కువగా ఉండే పానామా కాలువ ఆసియా, అమెరికా మధ్య వాణిజ్యానికి వెన్నెముక వంటిది. అయితే వాతావరణ మార్పుల వల్ల నీటి మట్టం తగ్గడం ఇక్కడ ప్రధాన సవాలుగా మారింది. మరోవైపు..  యూరోప్ మరియు ఆసియా ఖండాలను కలిపే సూయజ్ కాలువ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

గతంలో జరిగిన  ఎవర్ గివెన్ నౌక ప్రమాదం ప్రపంచానికి ఒక హెచ్చరికగా నిలిచింది. చైనాకు అత్యంత కీలకమైన మలక్కా జలసంధి ప్రస్తుతం అగ్రరాజ్యాల మధ్య వ్యూహాత్మక పోరాట కేంద్రంగా మారింది. తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడే చైనా, అక్కడ పట్టు సాధించేందుకు దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. ఇక ప్రపంచ చమురు సరఫరాను శాసించే హార్ముజ్ జలసంధి ఎప్పుడూ యుద్ధ మేఘాల మధ్యే ఉంటుంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇక్కడ ఇంధన ధరలను ప్రభావితం చేస్తున్నాయి.ఇటీవలి కాలంలో బాబ్ ఎల్-మందెబ్ మార్గంలో హౌతీ రెబల్స్ దాడుల కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఇ

ది కేవలం ప్రాంతీయ పోరాటం మాత్రమే కాదు.. అంతర్జాతీయ సరఫరా గొలుసును దెబ్బతీసే చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో టర్కీ జలసంధులు  బోస్పరస్, డార్డనెల్స్ ప్రపంచ ఆహార భద్రతలో.. ముఖ్యంగా గోధుమల రవాణాలో కీలక పాత్ర పోషి స్తున్నాయి.భవిష్యత్తులో ఈ 'చోక్ పాయింట్ల పై నియంత్రణ సాధించే దేశాలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అవకాశం ఉంది. చమురు ధరల నుంచి స్టాక్ మార్కెట్ల వరకు ప్రతిదీ ఈ మార్గాల భద్రతపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే అగ్రరాజ్యాలు తమ నౌకాదళాలను ఈ ప్రాంతాల్లో మోహరిస్తూ..  ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ సన్నని సముద్ర మార్గాలే ఆధునిక ప్రపంచ ఆర్థిక యుద్ధరంగాలని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

- సీతారాం కంఠమనేని

google-ad-img
    Related Sigment News
    • Loading...