మోడీ అంటే మండిపడుతున్న నలుగురు అమ్మలు

posted on: Apr 29, 2014 12:29PM

 

 

 

దేశమంతటా మోడీ హవా నడుస్తోంది. మోడీకే ఓటేద్దాం అనే మాట వినిపిస్తోంది. ఎవర్ని కదిలించినా మోడీ గురించి చెబుతున్నారు. దేశానికి కాబోయే ప్రధానమంత్రి మోడీయే అని చెబుతున్నారు. ఇలా అన్ని చోట్లా మోడీ గురించి బాగానే అనుకుంటున్నారు. కానీ దేశంలో నాలుగు మూలల్లో వున్న నలుగురు అమ్మలు మాత్రం మోడీ గురించి తమకు చేతనంతగా బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారు. ఆ నలుగురు అమ్మలు ఎవరయ్యా అంటే, సోనియాగాంధీ, జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి. ఈ నలుగురు అమ్మలూ మోడీ అంటే ఎందుకు మండిపడుతున్నారంటే....

 

సోనియాగాంధీ: ఈ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేసి తాను రిటైరై రెస్టు తీసుకోవాలని అనుకున్నారు. అయితే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీ ఎంటర్ కావడంతో సీన్ రివర్సయిపోయింది. మోడీ ఎంత సమర్థుడో దేశానికి తెలియడంతోపాటు ఆయనతో పోల్చి రాహుల్‌ గాంధీని ఎవరూ లెక్కచేయడం లేదు. అక్కడొచ్చింది. తేడా.



జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి: ఈసారి తానే ప్రధానమంత్రి కాబోతున్నానని కలలు కంటోన్న జయలలిత, మమతా బెనర్జీ, మాయావతి కలల మీద మోడీ నీళ్ళు కుమ్మరించాడు. ఈ ముగ్గురమ్మలూ ఎన్ని తంటాలు పడినా పీఎం అయ్యే అవకాశం లేకుండా చేశాడు. దాంతో ఈ ముగ్గురు కూడా అకారణంగా మోడీ మీద విరుచుకుపడుతున్నారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...