మోడీ పెళ్ళి కాంగ్రెస్ చావుకొచ్చింది!
posted on Apr 10, 2014 3:22PM
.jpg)
ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందంటారే.. అచ్చం అలాంటి సిట్యుయేషనే జాతీయ రాజకీయాల్లో వచ్చింది. బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీ వదోదరా పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేస్తూ తనకు 17 సంవత్సరాల వయసు వున్న సమయంలో యశోదాబెన్ అనే అమ్మాయితో పెళ్ళయిందని డిక్లేర్ చేయడం కాంగ్రెస్ పార్టీ చచ్చే చావు తెచ్చిపెట్టింది.
నరేంద్ర మోడీ పెళ్ళి విషయంలో ప్రజల్లో వున్న కన్ఫ్యూజన్ తొలగిపోవడంతోపాటు కాంగ్రెస్ పార్టీ మోడీని విమర్శించడానికి ఒక ఆయుధంగా పెట్టుకున్న మోడీ పెళ్ళి వ్యవహారం కూడా ఇప్పుడు ఆ పార్టీ చేతుల్లోంచి జారిపోయింది. 17 సంవత్సరాల వయసులో పెళ్ళి అయిన మోడీ ఆ తర్వాత దేశసేవ కోసం సంసార బంధాలు వదిలించుకున్నారు. ప్రజాసేవలోనే పూర్తిగా నిమగ్నమయ్యారు.
మోడీ పెళ్ళి విషయంలో ఏదో రహస్యం దాచేస్తున్నట్టు కాంగ్రస్ పార్టీ లేనిపోని హడావిడి చేస్తూ ఈ అంశం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు మోడీ తనకు పెళ్ళి జరిగినట్టు తానే స్వయంగా ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ అమ్ముల పొదిలో వున్న ఒక ఆయుధం మాయమైపోయింది. తద్వారా కాంగ్రెస్ పార్టీ చావుకి మార్గం మరింత సుగమమైంది.