నిజమైతే బావుండనిపించే గాసిప్... నానో చిప్!

posted on: Nov 9, 2016 9:03AM

 

నానో చిప్ అంటే ఏంటో మీకు తెలుసా? ఆ ఏముంది... నానో కార్ లో కూర్చుని చిప్స్ తినటం అంటారా! అస్సలు కాదు! ఈ మద్య సోషల్ మీడియాలో నానో చిప్ గురించి స్పైసీ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరీ ముఖ్యంగా, మోదీ పెద్ద నోట్లు రద్దు చేశాక ఇంకా బలంగా వినిపిస్తున్నాయి. ఇంతకీ నానో చిప్ సంగతేంటంటే... రద్దైన 5వందల నోట్లు స్థానంలో మళ్లీ కొత్తవి రాబోతున్నాయి. ఎప్పుడో తెలియదు కాని... ఇదైతే గాసిప్ కాదు. కాని, గాసిప్ ఏంటంటే... కొత్తగా రాబోతోన్న ఫై హండ్రెడ్ నోట్స్, అలాగే సరికొత్త టూ థౌజెండ్ నోట్స్ ... వీటిల్లో నానో చిప్స్ వుండబోతున్నాయట!


నానో చిప్ అంటే కొత్తగా రానున్న నోట్లలో పెట్టే ఒక చిన్న పరికరం! ఇది కరెన్సీ నోట్లలో వుండటం వల్ల ఆకాశంలో చక్కర్లు కొట్టే ఉపగ్రహాలు వెంటనే సదరు నోట్ ఎక్కడ వుందో పసిగ్గట్టేస్తాయట! అంటే సాటిలైట్ నుంచి వచ్చిన సిగ్నల్ మన నోట్లలో వుండే నాన్ చిప్ రిసీవ్ చేసుకుని రెస్పాండ్ అవుతుంది. వెంటనే ఆ సిగ్నల్ పసిగట్టిన సాటిలైట్ మనకు ఎన్ని నోట్లు, ఎక్కడ, ఎంత లోతున వున్నాయో చెప్పేస్తుందట! సూపర్ కదా... 


నాన్ చిప్ దెబ్బకి ఇక మీద ఎక్కడ నల్లధనం భారీగా దాచుకునే అవకాశమే వుండదని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు బయలుదేరాయి. కాని, ట్విస్ట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ అలాంటి మాట ఇంత వరకూ చెప్పలేదు. నానో చిప్ లాంటిదేదీ కొత్త కరెన్సీ నోట్ల వుంటుందని ప్రకటించలేదు. సో... నానో చిప్ ఉట్టి గాసిప్పే అనుకోవాలి ప్రస్తుతానికి. చూడాలి మరి... పాక్ దాడి చేసినా, నోట్లు రద్దు చేసినా అనూహ్యంగా చేసే మోదీ... ఈ నానో చిప్ సంగతి కూడా అవసరం అనుకున్నప్పుడు బయటపెడతారో... లేక ఇదంతా కేవలం టైం పాస్ క్యాండిడేట్ల క్రియేటివిటినో... కాలం తేల్చాలి!
 

google-ad-img
    Related Sigment News
    • Loading...