అది సినిమా కాదు పవన్ - లోకేష్

posted on: Nov 3, 2018 12:20PM

 

బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో ధీటుగా స్పందించారు. బీజేపీని గద్దెదించడానికి జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటును పవన్‌కల్యాణ్‌ ఫ్లాప్ షో అనడం సరికాదంటూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో చేస్తున్న పోరాటాన్ని సినిమాతో పోల్చడం బాధాకరమని మంత్రి లోకేష్ అన్నారు.

రైలు యాత్రలో పాల్గొన్న పవన్.. టీడీపీ-కాంగ్రెస్ మైత్రి భంధంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.ఢిల్లీలో చంద్రబాబు చూపించింది సినిమా విడుదలకు ముందు వచ్చే ట్రైలర్ లాంటిదని.. చంద్రబాబు సినిమా ప్లాప్ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపైనే లోకేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...