Latest News

అందుకే లోకేష్ కేసీఆర్‌ను ఢీ కొంటున్నారా?

posted on: Oct 10, 2014 7:34AM

 

తెలంగాణాలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని నిందిస్తున్నతెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని మొన్న తీవ్రంగా విమర్శించిన నారా లోకేష్ మళ్ళీ మరోసారి ఆయనపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చెందిన సంగతి అందరికీ తెలుసని కానీ ఆ విషయం కేసీఆర్ కే తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని, ఈ విషయంపై నేరుగా చంద్రబాబుతో చర్చించే దైర్యం ఆయనకు ఉందా? అని ప్రశ్నించారు. అసలు తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇదివరకు కూడా లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్ధులపై చాలా సార్లు ఇటువంటి విమర్శలు చేసేరు. కానీ ఇప్పుడు ఆయన నేరుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే నేరుగా విమర్శలు చేయడం గమనిస్తే, తెరాస నేతలు చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలపట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇంతవరకు ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ కొంత సంయమనం పాటిస్తూ వచ్చినా, ఇకపై ఎంత మాత్రం ఉపేక్షించబోదని ఆయన విమర్శలు స్పష్టం చేస్తున్నాయి.


google-ad-img
    Related Sigment News
    • Loading...