Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఐదు బిల్లులకు మండలి ఏకగ్రీవ ఆమోదం.!
posted on: Aug 20, 2026 3:17PM

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఐదు ప్రముఖ్యమైన బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ ఐదు కీలక బిల్లులనూ కూడా మంత్రి నారా లోకేష మండలిలో ప్రదేశపెట్టారు. రాష్ట్రంలో విద్య, గ్రంథాలయాలు, స్కిల్ డెవలప్‌మెంట్ రంగాలలో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం రూపొందించిన ఈ బిల్లులపై మండలిలో చర్చించిన అనంతరం సభ్యులు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లుఅలాగే ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లుకు కూడా శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే.. విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు సైతం సభ ఆమోదం పొందింది. విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ నియామకాలు, కేడర్ రిజర్వేషన్ల ప్రక్రియను క్రమబద్ధీకరించే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాసంస్థల సవరణ బిల్లుకూ సభ ఆమోదం తెలిపింది.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాలను నెలకొల్పేందుకు వీలు కల్పించే ఏపీ ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ బిల్లుకూ మండలి ఆమోదముద్ర వేసింది. ఈ ఐదు బిల్లులూ చట్ట రూపం దాలిస్తే.. రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు, లైబ్రరీ వ్యవస్థల ఆధునీకరణ ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన జ్ఞాన వనరులు అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు వల్ల రాష్ట్రంలోని యువతకు గ్లోబల్ స్థాయిలో ఉద్యోగావకాశాలు పొందేందుకు అవసరమైన శిక్షణ లభిస్తుంది. ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అవసరాలకు తగ్గ పాఠ్యాంశాలు అందుబాటులోకి వస్తాయి. మండలిలో ఏకగ్రీవం పొందిన ఈ ఐదు బిల్లులూ.. గవర్నర్ ఆమోద ముద్రతో చట్టంగా మారి అమలులోకి వస్తాయి.
Nara Lokesh, AP Legislative Council, AP Education Bills 2026, AP Private Skill University Bill, TeluguOne






