Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంగళగిరిలో 3 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేశ్
posted on: Jul 21, 2026 12:43PM
.webp)
మంగళగిరి నియోజకవర్గంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భారీ సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వేలాది పేద కుటుంబాలకు శాశ్వత ఆస్తి హక్కులను కల్పించారు. మంగళగిరి వేదికగా నిర్వహించిన 'మన ఇల్లు - మన లోకేశ్' కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేశ్ స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పట్టాలను అందజేశారు. సుమారు 3,000 మంది అర్హులైన పేదలకు రూ.1,000 కోట్ల విలువైన స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, పేదలకు ఇచ్చేది కేవలం ఒక కాగితం కాదని, తరతరాలకు అండగా నిలిచే శాశ్వత భూహక్కు అని పేర్కొన్నారు. నిరుపేదల ఆస్తులపై ఇకపై ఎవరూ కన్ను వేయలేరని, చట్టబద్ధమైన హక్కుల ద్వారా వారికి పూర్తి భద్రత లభిస్తుందని వివరించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఆదాయం కంటే ఖర్చులు భారీగా ఉండేవని గుర్తుచేశారు. రూపాయి ఆదాయానికి రూపాయి అరవై పైసల ఖర్చు ఉండే పరిస్థితుల నుంచి, రెండేళ్ల ప్రణాళికాబద్ధమైన పాలనతో ఖర్చును రూపాయి నలభై పైసలకు తగ్గించగలిగామని తెలిపారు.
రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన ఉద్ఘాటించారు. పాలనలో సంస్కరణలు తీసుకువస్తూనే, పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు.గత జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ, 2019 ఎన్నికల్లో తాను ఓటమి పాలైనప్పుడు కొందరు ఎగతాళి చేశారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఆ విమర్శలనే సవాలుగా తీసుకుని, మంగళగిరి నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చేందుకు పట్టుదలతో పనిచేస్తున్నట్లు చెప్పారు.
రాబోయే రోజుల్లో మంగళగిరిని దేశంలోనే అత్యుత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేశ్ పునరుద్ఘాటించారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి మరిన్ని పథకాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు.ఇళ్ల పట్టాలు పొందిన కుటుంబాల్లో తీవ్ర ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ చొరవతో నియోజకవర్గంలో ఉపాధి, రవాణా, పారిశ్రామిక రంగాలు మరింత పుంజుకుంటాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ ఉందని, ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్, పోలవరం, అమరావతికి నిధుల కేటాయింపు వంటి అంశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు లోకేశ్ తెలిపారు. కష్టకాలంలో అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు యువతకు ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని, ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Nara Lokesh, Mangalagiri House Titles, AP Coalition Government, Mana Illu Mana Lokesh, AP News Telugu, Deputy CM Pawan Kalyan, Visakhapatnam Railway Zone



.webp)


