నారా లోకేష్ కు బ్రహ్మణి జన్మదిన శుభాకాంక్షలు

posted on: Jan 23, 2026 8:02AM

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి  నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సతీమణి నారా బ్రహ్మణి భర్తకు శుక్రవారం (జనవరి 23) పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ తన బలం,  తన ప్రశాంతతగా అభివర్ణించిన ఆమె సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా రాష్ట్రం కోసం, ప్రజల కోసం  తన భర్త పడుతున్న శ్రమ, చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకున్నారు.   తన బలం, తన ప్రశాంతత అయిన లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షులు ఆంటూ ఆమె చేసిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.   తన పోస్టుకు తాను భర్తతో కలిసి ఉన్న ఫొటోను జత చేశారు. 

మరోవైపు, లోకేశ్ మామ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా అల్లుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...