నందుల రచ్చ వెనుక బడా నిర్మాత.... చంద్రబాబు చెక్...!
posted on: Nov 22, 2017 12:07PM

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై జరుగుతున్న రచ్చా అంత ఇంతా కాదు. ఇప్పటికే ఈ వ్యవహారం పై జరగాల్సిన రచ్చ అంతా జరిగిపోయింది. పెద్ద పెద్ద సినీ ప్రముఖులు సైతం ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంపై.. అవార్డులు ప్రకటించిన వారిపై మండిపడ్డారు. ఇది చాలా అన్యాయమని... కుల రాజకీయాలు జరిగాయి.. ఇవి నంది అవార్డులు కాదు.. కమ్మ అవార్డులు అని.. ప్రభుత్వం వారికి ఇష్టం వచ్చిన వాళ్లకు అవార్డులు ఇచ్చిందిని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విమర్శలు గుప్పించారు. దీంతో ఈ రచ్చపై లోకేశ్ కూడా ఘాటుగానే స్పందించాడు. ఆంధ్రాలో ఆధార్ కార్డు లేనివారు కూడా ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారంటూ గట్టిగానే సమాధానం చెప్పాడు. అయితే లోకేశ్ వ్యాఖ్యలు కూడా ఇంత దుమారం రేపుతాయని అనుకోలేదు. పోసాని లాంటి వాళ్ళు లోకేష్ ని పట్టుకుని తాగి మాట్లాడుతున్నావా అని ప్రశ్నించేసరికి.. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించని చంద్రబాబు.. దీనికి ఎలాగైనా పరిష్కారం చూడాలని నిర్ణయించుకున్నారు.
ఆ క్రమంలోనే కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. అసలు ఈ వ్యవహారం మొత్తం వెనుక ఉంది ఓ బడా నిర్మాత అని తెలిసిందట. మొత్తం వ్యవహారం ఓ సీనియర్ నిర్మాత కనుసన్నల్లో జరిగినట్టు నిర్ధారణకు వచ్చారట. ఇప్పుడు పోసాని ఏ బోయపాటికి అవార్డు వచ్చిందని రగిలిపోతున్నాడో ఆ అవార్డు కోసం గట్టిగా సిఫార్సు చేసింది కూడా ఆ అగ్ర నిర్మాత అట. బోయపాటికి అవార్డు ఇచ్చాక పోసానిని రెచ్చగొట్టడంలో కూడా ఆయన హస్తం ఉందట. ఇక ఇది తెలుసుకున్న చంద్రబాబు.. గట్టి షాక్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇంకో రూట్ లో ఆ నిర్మాత తో పాటు మరికొందరు సినీ పెద్దలకు షాక్ ఇచ్చేలా ప్లాన్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏపీ సర్కార్ మీద నందుల అంశంలో కొందరు దాడి చేయడానికి వారికి వున్న ఆర్ధిక బలం ప్రధాన కారణం అని టీడీపీ సర్కార్ గుర్తించిందట. అంతేకాదు... నిర్మాత వల్ల దెబ్బ తిన్న చిన్న సినిమాల నిర్మాతలు కొందరు బాబు దగ్గరకు వెళ్లి అక్కడ జరిగే అక్రమాల గురించి పూస గుచ్చినట్టు వివరించారట. ఆ అక్రమాలకు, నియంతృత్వానికి బ్రేకులేస్తే అంతా కంట్రోల్ లోకి వస్తుందని ఆ చిన్న నిర్మాతలు చెప్పిన ప్రతిపాదనల మీద గట్టిగా వర్కౌట్ చేస్తోందట బాబు సర్కార్. కొత్త నియమాలతో వచ్చే మార్పులు సదరు బడా నిర్మాతకు చుక్కలు కనిపిస్తాయి అంటున్నారు. మరి చూద్దాం చంద్రబాబు ఎలాంటి షాక్ ఇస్తారో...






.webp)



