Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నాంపల్లి అగ్నిప్రమాదంలో... ఐదు మృతదేహాలు వెలికితీత
posted on: Jan 25, 2026 10:18AM

హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 20 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో ఇప్పటివరకు ఐదు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. భవనంలోని సెల్లార్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గోడలకు రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశించిన బృందాలు, ముగ్గురి మృతదేహాలను గుర్తించాయి. మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదంలో బేబీ అనే మహిళ మృతదేహం వెలికితీత తీశారు
సెల్లార్ మొత్తం ఫర్నీచర్‌తో నిండి ఉండటం, దట్టమైన పొగ కమ్ముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది ప్రాణాల్ని పణంగా పెట్టి శ్రమిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని స్పష్టం చేశారు.ఫైర్ సేఫ్టీకి సంబంధించి నిబంధనలు పాటించకుండా ఘటనకు కారణమైన షాపు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, హైడ్రా అధికారులు సమన్వయం చేసుకొని చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం కోరారు






