నామకరణ మహోత్సవం థీమ్ ఆర్సీబీ..పేరు విరాట్!

posted on: Apr 10, 2026 2:46PM

ఇండియాలో  క్రికెట్ అంటే కేవలం ఒక క్రీడ కాదు. ఒక మతం.    క్రికెటర్లను అభిమానులు దేవుడితో సమానంగా కొలుస్తారు. తమ అభిమాన క్రికెటర్ కోసం చేసే పనులు ఆశ్చర్యానందాలను కలిగించడం కద్దు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక జంట తమ అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఉన్న మక్కువను వినూత్నచాటారు.  తమకు పుట్టిన కుమారుడికి  వారు విరాట్ నామకరణం చేశారు. తమ అభిమానాన్ని వారు చాటుకున్న తీరు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

తమ కుమారుడి నామకరణ మహోత్సవాన్ని ఆ జంట వినూత్నంగా నిర్వహించింది. ఈ వేడుకను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు థీమ్ తో నిర్వహించిన ఆ జంట.. ఒక చిన్న ఆర్సీబీ జెర్సీని ప్రదర్శించారు. ఆ జెర్సీ వెనుక నంబర్ 18, విరాట్ అని పేరు ముద్రించారు. తద్వారా వారు తమ కుమారుడికి విరాట్ అన్న పేరు పెట్టినట్లు చాటారు. ఈ విడియో ప్రస్తుతం నెటిజనులను విపరీతంగా ఆకర్షిస్తోంది.  ఆ విషయాన్ని అందరికీ వెల్లడించిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. 

ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లు యమా రంజుగా సాగుతున్న తరుణంలో ఈ జంట తమ కుమారుడికి నామకరణం చేసిన తీరు, ఆ జంటకు విరాట్ కోహ్లీ పట్ల ఉన్న అభిమానం క్రికెట్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంది.  ఆ జంట సృజనాత్మకపై  నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...