గ్రామ సచివాలయాలు కాదు.. విజన్ యూనిట్స్
posted on Nov 6, 2025 4:53PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ సచివాలయాల పేరు మార్చింది. ఇక నుంచీ వాటిని విజన్ యూనిట్స్ గా పిలవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరుకు చేసి, మరింత మెరుగైన సేవలు అందించే విధంగా రూపకల్పన చేయాలనీ, అందుకే వాటి పేరు విజన్ యూనిట్స్ గా మారుస్తున్నామన్నారు.
భవిష్యత్ లో ప్రజా సేవలకు విజన్ యూనిట్సే కేంద్ర బిందువులుగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా, సమర్థంగా అందించేలా టెక్నాలజీని వినియోగించుకోవాల్నారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు, రికార్డులు, సర్టిఫికెట్టు ఇలా అన్నీ ఒకే వేదిక నుంచి అందించేలా విజన్ యూనిట్స్ పని చేయనున్నాయని వివరించారు.