Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్నాతకోత్సవానికి చీఫ్ గెస్ట్ గా సీజేఐ వద్దు.. నల్సార్ విద్యార్థుల అల్టిమేటమ్.!
posted on: Aug 10, 2026 10:47AM

హైదరాబాద్‌లోని నల్సార్ లాయూనివర్సిటీ వార్షిక స్నాతకోత్సవ వేడుకలకు భారత ప్రధాన న్యాయమూర్తికి ఆహ్వానం పలకవద్దంటూ విద్యార్థులు గళమెత్తారు. ఈ మేరకు వర్సిటీ యాజమాన్యానికి అల్టిమేటం ఇచ్చారు. నల్సార్ లావర్సిటీ స్న తకోత్వానికి సీజేఐ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని యూనివర్సిటీ యాజమాన్యం నిర్ణయించింది. సాధారణంగా దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉన్న న్యాయమూర్తిని లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ఆహ్వానించడం సహజం. ఆ వర్సిటీకి అది గర్వకారణం కూడా. కానీ, నల్సార్ క్యాంపస్‌లోని విద్యార్థుల మాత్రం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ఆహ్వానించడానికి వీల్లేదంటూ వ్యతిరేకిండం కలకలం రేపింది. దాదాపు వర్సిటీ స్నాతకోత్సవానికి సీజేఐ సూర్యకాంత్‌ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించవద్దంటూ దాదాపు 450 మంది విద్యార్థులు సంతకాలు చేసిన లేఖను వర్సిటీ వీసీకి సమర్పించారు.
కొన్ని కేసుల్లో సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ వ్యవహరించిన తీరు తమను నిరాశకు గురిచేసిందని విద్యార్థులు ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా జులై 20న ఢిల్లీలో యువతపై పోలీసులు వ్యవహరించిన తీరుకు సంబంధించిన కేసుల విచారణ సంద ర్భంగా సీజేఐ తీరును ఆ లేఖలో ప్రస్తావిస్తూ.. ఆ కేసుల విచారణ సందర్భంగా విద్యార్థుల తరఫున న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ.. అందుకు సంబంధిచిన వీడియోలను చూపించేందుకు ప్రయ త్నించిన సమయంలో సీజేఐ సూర్యకాంత్ స్పందించిన తీరుపై ఆ లేఖలో విద్యా ర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వీడియోల ప్రదర్శన సమయం వృధా అన్నట్లుగా సీజేఐ వ్యాఖ్యలు ఉన్నాయని ఆ లేఖలో విద్యార్థలు పేర్కొన్నారు. న్యాయ విద్యార్థులుగా రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, న్యాయ ప్రక్రియ పై తమకు ఉన్న విశ్వాసా నికి ఈ వ్యవహారం విరుద్ధంగా ఉందనీ, ఈ నేపథ్యంలో స్నాతకోత్స వానికి సీజేఐ సూర్యకాంత్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలన్న నిర్ణయాన్ని యూనివర్సిటీ యాజమాన్యం పునఃసమీ క్షించాలని వారా లేఖలో కోరారు.
NALSAR Law University, CJI Surya Kant, NALSAR students letter, NALSAR convocation controversy, NALSAR Vice Chancellor, Supreme Court CJI invitation






