శంకర మఠంలో శ్రీ విధుశేఖర భారతీస్వామిని కలిసిన సీఎం రేవంత్
posted on: Oct 28, 2025 5:24PM
.webp)
హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. “ధర్మ విజయ యాత్ర” లో భాగంగా శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి హైదరాబాద్ విచ్చేశారు.
ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను భారతీస్వామివారికి ముఖ్యమంత్రి వివరించారు. సీఎం.. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విధుశేఖర భారతీస్వామిని కలిసి.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.






