కొండా సురేఖపై కేసును ఉపసంహరించుకున్న నాగార్జున
posted on Nov 13, 2025 9:12PM

మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పినందున ఆమెపై తాను పెట్టిన క్రిమినల్ కేసును ఉపసం హరించు కుంటున్నట్లు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు. కాగా గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సురేఖ్, నాగార్జునను, ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ, వారి పరువునకు నష్టం కలిగించాలన్న ఉద్దేశం కానీ తనకు ఎందమాత్రం లేదని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల్లో పొరపాటు జరిగి ఉంటే అందుకు చింతిస్తన్నట్లు పేర్కొన్న మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు సామాజిక మాధ్యమ వేిదక ఎక్స్ ద్వారా వెల్లడించారు.
గత ఏడాది అక్టోబర్‌లోమంత్రి సురేఖ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిపై విమర్శలు చేస్తూ.. నటుడు నాగార్జున కుటుంబంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నాగార్జున కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.
ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ బుధవారం (నవంబర్ 12) సోషల్ మీడియా వేదికగా గతంలో తాను నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. దీంతో నాగార్జున కొండా సురేఖపై దాఖలు చేసిన పరువునష్టం దావాను ఉపసంహరించుకున్నారు.