Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వదిలేయ్ రా అన్న శివాజీ... నాగార్జున వార్నింగ్!
posted on: Oct 7, 2023 2:42PM

బిగ్ బాస్ సీజన్-7 శనివారం ప్రోమో కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దానికి కారణం ఉంది. సీరియల్ బ్యాచ్ చేసే పాలిటిక్స్ అన్నీ నాగార్జున ప్రూఫ్ లతో సహా చూపించి వారికి బుద్దిచెప్తాడని అందరు అనుకుంటున్నారు. అదే జరిగింది. టాస్క్ లో ఎవరేం చేశారో చెప్తూ అడిగేశాడు నాగార్జున.
కెప్టెన్సీ టాస్క్ కోసం జరిగిన టాస్క్ లలో అమర్ దీప్ మాటలని పాయింట్ అవుట్ చేస్తూ.. ఆ బొక్కలో గేమ్ అని తిట్టావ్ అది కరెక్టేనా అని నాగార్జున అడుగగా.. సారీ సర్ అదేదో కామెడీగా అన్నానని అమర్ దీప్ అన్నాడు. ఇలా ఒక్కో కంటెస్టెంట్ వారు చేసే తప్పొప్పులని ఎత్తి చూపిస్తూ వారికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.
అసలు ప్రోమోలో ఏం ఉందంటే.. లాస్ట్ వీక్ మీకు జరిగినటువంటి అన్యాయాలు ఏమైనా ఉన్నాయా అని నాగార్జున అడిగాడు. నువ్వు స్టాండ్ తీసుకోకపోవడం మూలానా నీ బడ్డీ నష్టపోయిందని ప్రియాంక జైన్ గురించి శోభా శెట్టిని నాగార్జున అడిగాడు. తనేదో వివరిస్తుంటే.. ఫైనల్ రిజల్ట్ ఏంటని అడిగితే శోభా శెట్టి మొహం మాడ్చేసింది. ఆ తర్వాత శుభశ్రీ-గౌతమ్ ల బడ్డీ గురించి అడిగాడు నాగార్జున. నా సైడ్ నుండి నేనేమైనా చెప్తే తను యాక్సెప్ట్ చేయట్లేదని శుభశ్రీ అనగా.. గౌతమ్ పాపం తన ఫీలింగ్ కూడా రెస్పెక్ట్ చేయాలి కదా అని నాగార్జున అడిగాడు.
ఫ్రూట్ నింజా టాస్క్ లో ఆట సందీప్ తొక్కలు వేశాడని ప్రశాంత్ అంటుంటే.. వదిలేయ్ రా అని ఎలా అంటావని శివాజీనీ నాగార్జున అడిగాడు. అప్పుడు సంఛాలక్ అమర్ దీప్ కి చెప్పాలి కదా అని అనగా.. అసలు అమర్ దీప్ ఏం చెప్పిన వినడు సర్. వాడికొక నెగెటివ్ ఫీలింగ్. ప్రతీ దానికి గొడవలు పెట్టుకుంటే నాతోని కాదు సర్ అని శివాజీ అన్నాడు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.


.webp)



