Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇప్పటి వరకూ లక్ష్మీపార్వతిపై...నాదెండ్ల విమర్శించలేదు ఎందుకని?
posted on: Apr 24, 2026 2:24PM

ఏమాటకామాట నాదెండ్ల, లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితాన్ని మలుపు తిప్పిన వారే. నాదెండ్ల ఎన్టీఆర్ పార్టీ పెట్టినపుడు చేదోడు వాదోడుగా ఉండేవారు. అంతే కాదు పార్టీ జెండా, ఎజెండా ఆ రంగు- రుచి- వాసన- చిక్కదనాల మేళవింపులో సహ వ్యవస్థాపక పాత్ర పోషించిన మాట నిజం.
ఇక లక్ష్మీపార్వతి అయితే చాలా మంది ఒప్పుకోరుగానీ, రెండో భార్యగా ఆయన జీవితంలోకి అడుగు పెట్టి ఉత్థానం నుంచి పతనానికి తీసుకొచ్చి వదిలి పెట్టారు. అయితే ఈ ఇద్దరి ఉమ్మడి శతృవు మాత్రం చంద్రబాబే.
ఆనాడు నాదెండ్ల విషయంలో చంద్రబాబు ఆయన్నుంచి పదవి లాక్కుని.. తిరిగి ఎన్టీఆర్ కి కట్టబెడితే.. తిరిగి లక్ష్మీపార్వతి చేతుల్లోకి పార్టీ, ప్రభుత్వం రెండూ వెళ్లిపోతుందనగా.. తిరిగి చంద్రబాబే ఆ పదవిని లాక్కుని.. తన పరం చేసుకున్నారు. కాబట్టి వీరిద్దరి వ్యూహ ప్రతివ్యూహాలను చేదించిన అభినవ అర్జనుడు చంద్రబాబే.
రామారావు అసలు పార్టీ పెట్టారంటే తన వల్లే అంటారు నాదెండ్ల. ఇక ఆ స్వామి చరణదాసిని నేను అంటారు లక్ష్మీపార్వతి. ఇందాకే అనుకున్నట్టు ఇద్దరి ఉమ్మడి టార్గెట్ చంద్రబాబే. ఇక్కడ విచిత్రమైన విషయమేంటంటే నాదెండ్ల ఎందరెందరో పుట్టుపూర్వోత్తరాలను తిరగరాసేవారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు గురించి అడ్డం- పొడవు మాట్లాడేవారు. కానీ ఇప్పటి వరకూ లక్ష్మీపార్వతి విషయంలో కించిత్ మాట ఎక్కడా అనలేదాయన.
దీనంతటికీ కారణం.. మళ్లీ చంద్రబాబే. ఆయనే వీరిద్దరి కామన్ ఎనిమీ కాబట్టి.. ఇద్దరూ మంచి మిత్రుల్లాగానే వ్యవహరించారు. మొన్న విజయమ్మ విషయంలో లోకేష్ పై అవాకులు చెవాకులు పేలినపుడు కూడా లక్ష్మీపార్వతి టార్గెట్ మొత్తం చంద్రబాబే. ఏనాడూ కూడా ఆమె నాదెండ్ల నమ్మక ద్రోహాన్ని ఎత్తి చూపించిన పాపాన పోలేదు.
వీరిద్దరి నిర్వాకానికి పార్టీని కాపాడ్డమే చంద్రబాబు చేసిన తప్పు. ఇక్కడ మనమంతా గుర్తించాల్సింది ఏంటంటే.. ఒక వేళ నిజంగా వీళ్లన్నట్టు చంద్రబాబే ఎన్టీఆర్ పట్ల అంతటి నమ్మక ద్రోహి అయి ఉంటే ఆయన కూడా ఎప్పుడో పతనావస్తకు చేరుకునేవారు. కానీ, ఆయన అంతకంతకూ ఎదుగుతూ వచ్చారంటేనే తెలియట్లా ఆయన చేసిందంతా మంచేననీ..
అదే నాదెండ్ల, లక్ష్మీపార్వతి జనం దృష్టిలో ఎలాంటి వారో అందరికీ తెలిసిందే. వీరు వీరి తెరచాటు బాగోతాలకు జనామోదం లేదు. అదే చంద్రబాబు అలాక్కాదు.. ప్రజల కోసం, కార్యకర్తల కోసం ఇదంతా చేయడం వల్లే నేడు ఆయనీ స్థాయిలో ఉన్నారు. మిగిలిన ఈ ఇద్దరూ కలుగుల్లో దాక్కుని.. జనానికి సరిగా మొహం చూపించలేక ముడుచుకుని మూల కూర్చోవల్సిన దుస్థితికి చేరారని అంటారు పలువురు విశ్లేషకులు.


.webp)
.webp)


