నా అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్!
posted on: Feb 20, 2026 9:23AM

ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ అయింది. నా అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశాన్ని దూషించినందుకు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో గతంలో ఈ యూట్యూబర్ పైకేసు నమోదైంది. దీంతో ఆ ఖాతా వివరాలు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యానికి సీసీఎస్ పోలీసులు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్యంఆ వివరాలు అందజేసింది.
వాటిని పరిశీలించిన సీసీఎస్ పోలీసులు అన్వేష్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు నిర్థారణకు వచ్చి అతడి అకౌంట్‌ను తొలగించాలని ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్‌కు మరో లేఖ రాశారు. ఆ లేఖతో అన్వేష్ ఖాతాను ఇన్‌స్టాగ్రామ్ మేనేజ్‌మెంట్ బ్యాన్ చేసింది. గతంలో అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండేవారు. హిందూమతం, భారతదేశంపై అనుచిత కామెంట్లు చేయడంతో అతడి ఫాలోవర్ల సంఖ్య 1.3 మిలియన్లకు తగ్గింది. ఇప్పుడు అతడి ఖాతా పూర్తిగా బ్యాన్ అయింది.
తెలుగులో ఎక్కువ మంది వీక్షించే ట్రావెల్ వ్లాగర్‌లలో అన్వేష్ ఒకరు . ట్రావెల్ వ్లాగింగ్ అంటే మీ ప్రయాణాలను వీడియోల ద్వారా అందరితో పంచుకోవడం. అంటే.. ప్రయాణాలకు సంబంధించిన వీడియోలను తీసి, వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి, ఇతరులతో పంచుకోవడం. అలా చేసే వారినే ట్రావెల్ వ్లాగర్ అంటారు .
మహిళల వస్త్రధారణపై కొద్ది రోజుల క్రితం చెలరేగిన వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తూ ఆ సమయంలో అన్వేష్ ఓ వీడియో రూపొందించాడు. తన వాదన వినిపించే క్రమంలో అనుచిత భాష వాడడం, హిందూ దేవతల పేర్లు తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. పురాణగాథల్లో జరగని ఘటనలు జరిగినట్టు అర్థం వచ్చేలా, సీత, ద్రౌపదిల గురించి వ్యాఖ్యానించాడు. ప్రవచనకారుల గురించి జుగుప్సాకరంగా మాట్లాడాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి.


.webp)
.webp)


