టీడీపీలోకి మైసూరా..? ప్రత్యేక రాయలసీన ఉద్యమం ఏమైందో..!

posted on: Jan 16, 2016 2:30PM

కొంతమంది నేతలు ఏదో ఒక రకంగా ప్రెస్ మీట్లు పెట్టి.. అనవసరంగా హంగామా చేసి నాలుగు మాటలు మాట్లాడి ఫేమస్ అయిపోదామని చూస్తారు. అలాంటి వారిలో వైసీపీ సీనియర్ నేత మైసూరా రెడ్డి కూడా ఒకరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీ ముఖ్యమంత్రి అమరావతి రాజధానిపైనే ఎక్కువ శ్రద్ద చూపిస్తున్నారు అంటూ.. రాయలసీమను పట్టించుకోవడం లేదని.. రాయలసీమకు అన్యాయం జరగనివ్వం.. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికారు. కానీ ఎవరిమీదైతే విమర్శలు చేశారో ఇప్పుడు అదే పార్టీలో చేరడానికి చూస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అంటూ కొన్నిరోజులు హడావుడి చేసిన వైసీపీ సీనియర్ నేత మైసూరా రెడ్డి ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు. కొద్ది రోజులుగా వైసీపీ పార్టీలో తనకు అంత ప్రాధాన్య ఇవ్వకపోవడం.. అందునా తనకు రాజ్యసభ సీటు వస్తుందని ఆశించినా అది కూడా వచ్చే అవకాశం లేనందున మైసూరా తీవ్ర అసంతృప్తితో ఉన్నారంట. దీంతో కనీసం ప్రత్యేక రాయలసీమ ఉద్యమం పేరుతో అయిన కాస్త పేరు తెచ్చుకుందామని అనుకున్నా ఓ రెండు రోజులు దాని గురించి హడావుడి చేశారు అంతే.. తరువాత అది కూడా మరిచిపోయారు. ఇక ఇవేమి వర్కవుట్ కావని అనుకున్నారేమో వేరే పార్టీలోకి జంప్ అవుదామని చూస్తున్నారంట.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీలో చేరుడానికి మైసూరారెడ్డి చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీలో కంటే టీడీపీలో ఉంటేనే మేలని ఆయన ఈ నిర్ణయానికి వచ్చారంట. అంతేకాదు వైసీపీ పై ఉన్న అసంతృప్తి కారణంగా మైసూరాను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ నేతలు కూడా ప్రయత్నిస్తున్నారంట. ముఖ్యంగా కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత, చంద్రబాబు సన్నిహితుడు సీఎం రమేశ్ మైసూరాను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంట. దీనిలో భాగంగానే మైసూరా గురించి చంద్రబాబుతో కూడా చర్చించినట్టు.. మైసూరాతో జగన్ కు చెక్ చెప్పొచ్చని చెప్పడంతో చంద్రబాబు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు కావాలంటే మైసూరాకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడానికి కూడా చంద్రబాబు అంగీకరించారని సమాచారం. మరోవైపు మైసూరా టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా అలర్ట్ అయి మైసూరాను బుజ్జగించే పనిలో పడ్డారంట. మొత్తానికి ఇప్పటికే చాలామంది వైసీపీని వీడుతున్న తరుణంలో ఇప్పుడు మైసూరా కూడా వైసీపీని వీడితే జగన్ కు మరో షాక్ తగిలినట్టే. ఇక మైసూరా రెడ్డి విషయమైతే ప్రత్యేక ఉద్యమం అన్న మైసూరా ఇప్పుడు ఆ సంగతేమైంది.. రెండు రోజులు ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేసిన మైసురా పాపం ఇప్పుడు పార్టీ మారే పరిస్థితి వచ్చింది అంటూ రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...