Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఇద్దరు భార్యలు.. 18 మంది సంతానం.. హత్యకు దారి తీసిన వివాహేతర సంబంధం
posted on: Mar 24, 2026 10:07AM
.webp)
ఇద్దరు భార్యలు, ఒక్కొరికి 9 మంది పిల్లలు.. అంటే 18 మంది సంతానం, చాలదన్నట్లు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది కాస్తా బెడిసికొట్టి వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ చేతిలోనే హతమయ్యాడు. యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లా సుమేర్‌పూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం సుమేర్‌పూర్‌కు చెందిన ముస్తాకా గుల్షన్ అలియాస్ మున్నా సుమన్ దేవి అనే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆమెను బలవంతంగా ఆ బంధంలోకి దింపాడనే ఆరోపణలున్నాయి. ఆ క్రమంలో సుమన్ దేవిని తరచు కలవాలని ఒత్తిడి చేశేవాడంట. దాంతో విసిగిపోయిన ఆ మహిళ తన సోదరుడితో కలిసి మున్నాని హత్య పథకం పన్నింది.
ఆ పథకం ప్రకారం ఈ నెల 18న మున్నాను తన ఇంటికి పిలిచింది. అతడు లోపలికి రాగానే సుమన్ సోదరుడు తన స్నేహితులతో కలిసి వెనుక నుంచి ఇనుపరాడ్‌తో దాడిచేయడంతో మున్నా అక్కడికక్కడే చనిపోయాడు. తర్వాత మృతదేహాన్ని బస్తాలో కుక్కి కాలువలో పడేశారు. మున్నా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసుల దర్యాప్తు చేసి విషయం రాబట్టారు.
మున్నా చివరి ఫోన్ కాల్ ఆధారంగా సుమన్‌ను విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. కాలువ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇద్దరు భార్యలు, 18 మంది సంతానం ఉన్న మున్నా అక్రమ సంబంధం కారణంగా హత్యకు గురవ్వడంతో స్థానికంగా సానుభూతి కనబర్చేవారు కూడా కరువయ్యారంట.






