అమెరికాలో తల్లీ కొడుకుల హత్య.. ఎనిమిదిన్నరేళ్ల తర్వాత హంతకుడి గుర్తింపు
posted on Nov 20, 2025 10:19AM
.webp)
అమెరికాలో ఎనిమిదిన్నరేళ్ల కిందట జరిగిన తల్లీ కొడుకుల హత్య కేసులో నిందితుడిని ఎట్టకేలకు కనిపెట్టారు. తొలుత ఈ కేసులో హతురాలి భర్తే నిందితుడిగా అనుమానించారు. హతురాలి తల్లిదండ్రులు సైతం అతడిపైనా ఆరోపణలు చేశారు. ఫిర్యాదు చేశారు. అయితే భర్తే హత్య చేశాడన్న ఆధారాలేవీ దొరకలేదు. చివరికి హత్య జరిగిన ఎనిమిదిన్నరేళ్ల తరువాత అసలు నిందితుడిని కనిపెట్టారు. ఎనిమిదిన్నరేళ్ల తర్వాత నిందితుడ్ని కనిపెట్టారు.
వివరాల్లోకి వెడితే..
అమెరికా న్యూజెర్సీలోని మెపుల్ షేడ్‌లోని ఫాక్స్ మెడో అపార్ట్‌మెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ శశికళ నర్రా , ఆమె కుమారుడు హత్యకు గురయ్యారు. అప్పట్లో అందరూ శశికళ భర్త నర్రా హనుంతరావే హంతకుడని అనుమానించారు. ఎనిమిన్నరేళ్ల విచారణ తర్వాత అమెరికా పోలీసులు అసలు నిందితుడిని కనిపెట్టారు. హంతకుడిని నజీర్ హమీద్ గా గుర్తించారు. నజీర్ కూడా ఇండియనే. శశిఖళ భర్త హనుమంత్ రావు నర్రా మాజీ సహోద్యోగి. వృత్తిపరమైన వివాదాల కారణంగా వ్యక్తిగత ప్రతీకారేచ్ఛతో అతడే ఈ హత్యలకు పాల్పడ్డాడని అమెరికా పోలీసులు తెలిపారు.
కాగా శశికళ, ఆమె కుమారుడిని హత్య చేసిన తరువాత నజీర్ అహ్మద్ ఇండియా వచ్చేశాడు. ఇప్పుడు అతడిని తమకు అప్పగించాలంటూ అమెరికా ఇండియన్ గవర్నమెంట్ తో సంప్రదింపులు చేస్తున్నది. ఇంతకీ నజీర్ అహ్మద్ హంతకుడని ఎలా కనిపెట్టగలిగారంటే.. అతడు గతంలో పని చేసిన కంపెనీలో ఉపయోగించిన లాప్ టాప్ ద్వారా డీఎన్ ఏను సేకరించి.. క్రైమ్ ప్రదేశంతో ఉన్న రక్తపు మరకలతో సరిపోల్చడం ద్వారా నజీరే హంతకుడని గుర్తించారు.