Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మద్యం కుంభకోణం కేసు.. ఎవరీ ముప్పిడి అవినాష్ రెడ్డి?
posted on: Feb 27, 2026 1:36PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజా చార్జిషీట్ లో పేర్కొన్న ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరు? మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారడంలోనూ, ఆ నిధులను సేకరించడం, కమిషన్లు రాబట్టడం వంటి విషయాల్లో కలక సూత్రధారిగా సిట్ పేర్కొన్న ముప్పిడి అవినాష్ రెడ్డి ఎక్కడి వాడు? అన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి కమిషన్లను సేకరించడమే కాకుండా వాటిని భద్రంగా సిండికేట్ కు అందించడంలోనూ ముప్పిడి అవినాష్ రెడ్డిదే కీలక పాత్ర అని సిట్ చెబుతోంది. మొత్తం సిండికేట్‌కు అవినాష్‌రెడ్డే కీలకమని సిట్ తన చార్జిషీట్ లో పేర్కొంది. నిధులను దారి మళ్లించి.. సిండికేట్ లోని కీలక వ్యక్తులకు చేరవేయడం అవినాష్ రెడ్డి చేతుల మీదుగానే జరిగిందన్న ఆరోపణలు ఉన్న సంగతి విదితమే.
అలాగే ఎవరైతే ఎక్కువ కమీషన్లు ఇవ్వడానికి ఓకే అన్నారో.. వారికి మాత్రమే ఆర్డర్లు దక్కేలా చక్రం తిప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి అత్యంత కీలకంగా మారారని సిట్ పేర్కొంది. ఇటీవల హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముప్పిడి అవినాష్ సిట్ అధికారుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే.
అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కొరునప్పటికీ.. కోర్టు నిరాకరించడంతో అవినాష్ రెడ్డి లొంగిపోక తప్పలేదు. ఇక రిమాండ్ రిపోర్టులో అవినాష్ రెడ్డి మద్యం తయారీ కంపెనీల నుంచి 3500 కోట్ల రూపాయల ముడుపులు సేకరించినట్లు సిట్ పేర్కొంది. ఈ సొమ్మును 2024 అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించే విషయంలోనూ అవినాష్ రెడ్డే కీలకంగా వ్యవహరించారనీ సిట్ రిమాండ్ రిపోర్టు పేర్కొంది.






