మున్సిపల్ ఎన్నికలు- రాజకీయ పార్టీలకు సెమీ ఫైనల్స్

 

రాష్ట్రం రెండు ముక్కలయ్యి సార్వత్రిక ఎన్నికలకి సిద్దపడుతున్నవేళ మధ్యలో మునిసిపల్ ఎన్నికల వచ్చిపడుతున్నాయి. మునిసిపల్ ఎన్నికలకు షెడ్యుల్ కూడా విడుదలైంది. మార్చి 30వ తేదీన ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 10వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు ఉంటుంది. పార్టీ గుర్తులపైనే జరిగే ఈ ఎన్నికలలో మొత్తం 11వేల ఈవీఎంలు ఉపయోగిస్తారు.

 

సాధారణంగా అధికార పార్టీ తనకు అనుకూలంగా పరిస్థితులు లేవాణి భావిస్తే ఇటువంటి ఎన్నికలను వాయిదా వేసుకొంటూ పోతుంది. కానీ, కీలకమయిన సార్వత్రిక ఎన్నికలకు ముందు మున్సిపల్ ఎన్నుకలు రావడం, అది కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనలో ఉన్నపుడు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సమయంలో ఎన్నికలు రావడం యాద్రుచ్చికమో లేక ముందుగానే నిశ్చయమైందో తెలియకపోయినా, సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఈ మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు సెమీ ఫైనల్ వంటివని భావించవచ్చును. ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలలో రాజకీయ పార్టీల బలాబలాలకు అద్దం పడతాయి.