మునిసిపోల్స్ ఓట్ల లెక్కింపు ప్రారంభం

posted on: Feb 13, 2026 8:04AM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం (ఫిబ్రవరి 13) ఉదయం8 గంటలకు ప్రారంభమైంది.  రాష్ట్రవ్యాప్తంగా 123 కేంద్రాల్లో  ఈ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 7 మునిసిపల్ కార్పొరేషన్లలోని   412 డివిజన్లు, 116 మునిసిపాలిటీలలోని 2,569 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

లెక్కింపు పూర్తయిన తరువాత ఫలితాలు వెల్లడిస్తారు. మధ్యాహ్నానికి కార్పొరేషన్, సాయంత్రానికి మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.   కాగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది.   వెబ్‌కాస్టింగ్ ద్వారా రాష్ట్ర, జిల్లా అధికారులు ఓట్ల లెక్కిపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.  

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్‌లోకి అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్టు వినా ఇతరులను అనుమతించడం లేదు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...