మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా : సీఎం రేవంత్
posted on: Feb 4, 2026 5:31PM
.webp)
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ప్రతి ఓటు ముఖ్యమని అందరినీ కలుపుకుని వెళ్లాలని దిశానిర్ధేశం చేశారు. మిర్యాలగూడ పర్యటనలో భాగంగా గూడూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శంకుస్థాపన చేసి, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇస్తామని తెలిపారు.
దీనికీ రూ. 9 వేల కోట్లు సిద్దం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో నిరుపేదలు 3.17 కోట్ల మందికి 6 కిలోల సన్నబియ్యం, ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుపై రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేస్తున్న మా కార్యకర్తల్ని బెదిరిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. నాకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అంత పెద్ద మనసు లేదని తెలిపారు.
కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తాకట్టు పెట్టాడని భాస్కర్ రావు ఉద్దేశించి అన్నారు. మా వాళ్ల జోలికి వస్తే ఒళ్లు చింతపండు అయితని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్యాలగూడ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు నమ్మక ద్రోహి అని..జానా రెడ్డిని కూడా ఓడించడానికి భాస్కర్ రావు ప్రయత్నం చేశారని సీఎం విమర్శించారు. మిర్యాలగూడలో గెలుస్తామనే నమ్మంతో ఇక్కడి నుంచే ప్రచారం మొదలుపెట్టాని ధీమా వ్యక్తం చేశారు.






