Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు
posted on: Feb 3, 2026 5:42PM

మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్లు ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఈ రాత్రి లేదా లేదా ఉదయానికి పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల ఎన్నికల చిహ్నాలు పొందిన వెంటే ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.
బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సివస్తే ఫిబ్రవరి 12న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఫలితాలు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 16న 116 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి


.webp)
.webp)


