మున్సిపల్ చైర్మన్ ఎన్నికల పరిశీలకులను ప్రకటించిన బీఆర్‌ఎస్
posted on: Feb 16, 2026 8:00PM
.webp)
మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల ప్రక్రియలో అధికార కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న అరాచకాలు, కుట్రల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. రేపు ఎన్నికలు జరగనున్న కీలకమైన హంగ్ మున్సిపాలిటీల కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా ఎన్నికల ఇన్-ఛార్జిలను నియమించారు. ఈ మేరకు ఆయన ఆయా మున్సిపాలిటీల స్థానిక నాయకత్వం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు ఇన్-ఛార్జిలతో స్వయంగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు.
స్థానికంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అక్రమ కిడ్నాప్‌లు, బెదిరింపులు మరియు పోలీసుల దుర్వినియోగం వంటి అంశాలను అడిగి తెలుసుకున్న కేటీఆర్, పార్టీ పార్టీ స్థానిక నాయకత్వానికి అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ అరాచకాల నేపథ్యంలో స్థానిక నాయకత్వానికి అన్ని విధాలా అండగా నిలబడేందుకు, ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున సీనియర్ నాయకులను ప్రత్యేక ఇన్-ఛార్జిలుగా పంపుతున్నట్లు ప్రకటించారు.
ఆయన ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నేతలు వెంటనే తమకు కేటాయించిన మున్సిపాలిటీలకు బయలుదేరి వెళ్లారు. రేపు ఎన్నికలు జరగనున్న 8 మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ స్పష్టంగా ఛైర్మన్ పీఠాలను గెలుచుకునే అవకాశం ఉన్నందున, ఈ ఎన్నికలను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఈ ఎనిమిది మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని, కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు చేసినా తమ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోలేరని పార్టీ ధీమా వ్యక్తం చేసింది.
ఆయా మున్సిపాలిటీలకు నియమించబడిన ఇన్-ఛార్జిల వివరాలు :
తోర్రూర్ : ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్
జనగామ : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మరియు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
క్యాతనపల్లి : ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఖానాపూర్: ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఇంద్రేశం: ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
కాగజ్ నగర్ : మాజీమంత్రి జోగు రామన్న
జహీరాబాద్: ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు






