ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాకు ఉద్వాసన?

posted on: Apr 23, 2026 1:18PM

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో నాకౌట్ కు చేరకుండానే వెనుదిరుగుతుందా? అన్న అనుమానాలు ముసురుకున్న వేళ.. తెలుగుతేజం తిలక్ వర్మ తన అద్భుత బ్యాటింగ్ తో ముంబై ఇండియాను మళ్లీ  గెలుపు పట్టాలెక్కించాడు. గుజరాత్ టైటాన్స్ పై  జరిగిన మ్యాచ్ లో   తిలక్ వర్మ అద్భుతమైన సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. కేవలం 45 బంతుల్లోనే అజేయమైన శతకాన్ని నమోదు చేసి ముంబై ఇండియన్స్‌కు భారీ విజయాన్ని అందించారు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో  తిలక్ వర్మపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.  ఇందులో భాగంగా మాజీ క్రికెటర్  ప్రముఖ కామెంటేటర్  ఆకాశ్ చోప్రా  తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ కాబోయే కెప్టెన్ గా పేర్కొన్నాడు.  ఆకాశ్ చెప్పా వ్యాఖ్యలు ఇప్పడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు తావిచ్చాయి. 

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో  మ్యాచ్‌లో తిలక్ వర్మ ప్రదర్శన చూస్తుంటే..  అతడొక సంపూర్ణ బ్యాటర్  అన్నవిషయం అదర్ధమౌతోందన్న ఆకాశ్ చోప్రా.. ముంబై ఇండియన్స్ కు తిలక్ వర్మ భవిష్యత్ కెప్టెన్ కాగల అన్ని అర్హతలూ ఉన్నబ్యాటర్ అని పేర్కొన్నాడు. తిలక్ వర్మ ఐపీఎల్ జట్టును నడిపించే రోజు ఎంతో దూరంలో లేదన్నాడు.   తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, వచ్చే రెండేళ్లలో లేదా అంతకంటే ముందే తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ కు సారథ్యం వహిస్తాడని జోస్యం చెప్పాడు. దీంతో సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాకు ఉద్వాసనేనా అన్న చర్చ మొదలైంది.   

అది పక్కన పెడితే.. తిలక్ వర్మకు నాయకత్వ బాధ్యతలూమీ కొత్త కాదు.  దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్ రంజీ జట్టుకు, దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్‌కు కెప్టెన్ గా వ్యవహరించాడు.  అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా 'ఏ' జట్టుకు, ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌లో భారత జట్టుకు కూడా నాయకత్వం వహించిన అనుభవం తిలక్ వర్మకు ఉంది.  ఈ నేపథ్యంలోనే ఆకాశ్ చోప్రా వ్యాఖ్యలు అంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  ముంబై జట్టులో కూడా  రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా వంటి దిగ్గజాల తర్వాత ముంబై పగ్గాలను చేపట్టే సత్తా ఉన్న ఏకైక యువ ఆటగాడిగా అభిమానులు తిలక్‌ను చూస్తున్నారు. ఐపీఎల్ 2026లో తిలక్ చేసిన ఈ సంచలన సెంచరీ, అతడి బ్యాటింగ్ సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా, జట్టులో అతనికున్న ప్రాముఖ్యతను కూడా చాటిచెప్పింది.  ఇప్పటికిప్పుడు కాకపోయినా వచ్చే ఏడాది రెండేళ్లలో తిలక్ వర్మ ఏదో ఒక ఐపీఎల్ జట్టకు సారథ్యం వహించడం ఖాయమని క్రికెట్ పండితులు కూడా చెబుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...