Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నా ప్రేమను నిరూపించడానికి వాలెంటైన్స్ డే అవసరం లేదు
posted on: Feb 15, 2026 2:40PM

ముక్కు అవినాష్(Mukku Avinash) అంటే చాలు ఆడియన్స్ గుర్తుపట్టేస్తారు. జబర్దస్త్ నుంచి కమెడియన్ గా మొదలైన ప్రయాణం ఇప్పుడు ఇంకా స్థాయి పెరిగింది. బిగ్ బాస్ కి వెళ్ళాడు. ఇక ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి పక్కన పాలేరుగా కనిపిస్తున్నాడు. అలాంటి అవినాష్ వాలెంటైన్స్ డే రోజున తన భార్యతో కలిసి దిగిన పిక్స్ ని షేర్ చేసాడు.
"నువ్వు నా ప్రేమ సామ్రాజ్యానికి రాణివి. దాన్ని నిరూపించుకోవడానికి నాకు వాలెంటైన్స్ డే అవసరం లేదు. నాకు, ప్రతి రోజు వాలెంటైన్స్ డేనే ఎందుకంటే నేను నిన్ను చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను! నా ప్రియమైన భార్యకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు." అంటూ పోస్ట్ పెట్టాడు అవినాష్. అలాగే తన భార్య అనుజాతో దిగిన పిక్స్ ని షేర్ చేసుకున్నాడు.
కామెడీ స్టార్స్ షో ద్వారా అవినాష్ గతంలో అందరినీ అలరించాడు. ఈ మొత్తం క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 4 కి వెళ్ళాడు. ఇక అవినాష్ -అనుజా లైఫ్ లో ఒక బేబీ వస్తుంది అనుకున్న టైంలో మిస్-క్యారేజ్ అయ్యింది. 7 వ నెలలోనే బిడ్డ కడుపులో చనిపోయింది అంటూ చెప్పాడు.
ఇక వాలెంటైన్స్ డే నాడు వీళ్ళ క్యూట్ పిక్స్ చూసి నెటిజన్స్ అంతా విషెస్ చెప్పారు. క్యూట్ జోడి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, లవ్లీ ఫామిలీ, సూపర్ జోడి, లాంగ్ లివ్ అంటూ చెప్తున్నారు. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి పక్క పెద్ద పాలేరుగా ఫిక్స్ ఐపోయి తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్విస్తున్నాడు అవినాష్.
https://www.instagram.com/p/DUu0GS0j53z/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==






