తిరుమలలో తిరుమల శాటిలైట్ కిచెన్ కు వంద కోట్ల విరాళం
posted on Nov 10, 2025 10:02AM

అపరకుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తిరుమల అన్న ప్రసాదం ట్రస్ట్ కు వంద కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. తిరమలలో నిత్యం దాదాపు రెండు లక్షల మందికి నిత్యం అన్నప్రసాదాలు తయారు చేయడానికి వీలుగా కొత్త శాటిలైట్ కిచెన్ నిర్మాణం కోసం ఆయన ఈ విరాళం ప్రకటించారు. ఈ శాటిలైట్ కిచెన్ ను తాను అన్నదానం ట్రస్ట్ కు అంకితం చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. ముఖేస్ అంబానీ ఆదివారం (నవంబర్ 9) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావడం తమకు లభించిన మహాభాగ్యమని పేర్కొన్నారు.
ఆ తరువాత ఆయన రాజస్థాన్ లోని నాథ్ ద్వారా ఆలయాన్ని కూడా ఆదివారం (నవంబర్ 9) సందర్శించారు. ఆ సందర్భంగా అక్కడ భక్తుల కోసం యాత్రికుల సముదాయాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఇందు కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇందు కోసం తొలి విడతగా 15 కోట్ల రూపాయలు అందజేశారు.
అలాగే అదే రోజు ఆయన కేరళలోని గురవాయూర్ కృష్ణ దేవాలయాన్ని సందర్శంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురవాయూర్ లో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలటీస్ ఆస్పత్రికి 16 కోట్ల రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు ఆయన 15 కోట్ల రూపాయల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు.