ముద్రగడ పద్మనాభం...డీజీపీ వార్నింగ్...

posted on: Jul 25, 2017 4:58PM

 

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కూడా ముద్రగడ పాదయాత్రకు పూనుకున్నా... అది జరగడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. కానీ ఈసారి మాత్రం ముద్రగడ తను ఎలాగైనా పాదయాత్రను చేపట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ పాదయాత్రకు ఎలాంటి అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. 30, 144 సెక్షన్లు అమల్లో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమించి పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. కాపు నేతలు గతంలోనూ విధ్వంసాలకు పాల్పడ్డారని, ఎవరైనా ఆస్తులు ధ్వంసం చేస్తే కేసులు పెడతామని ఆయన స్పష్టం చేశారు. సంఘ విద్రోహశక్తులు పాదయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుంటే చూస్తూ ఊరుకోమని డీజీపీ వార్నింగ్‌ ఇచ్చారు. మరోవైపు ముద్రగడ పాదయాత్ర దృష్ట్యా ఏపీ సచివాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. వెంకటపాలెం, మందడం గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ముద్రగడ పాదయాత్రకు భయపడేది లేదని, అలాగే వెనకడుగు వేసేది లేదన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...