Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో కీలక ఒప్పందాలు
posted on: May 25, 2026 8:20PM
.webp)
ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్తగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్రంలో స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి గాను వివిధ సంస్థలు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో నడిచే రూరల్ అవుట్ పోస్టులను కూడా సీఎం ఆవిష్కరించారు. మంగళగిరి, పిఠాపురం, కుప్పంలో రుటాగ్ ఈ స్మార్ట్ విలేజ్ సెంటర్లను పైలట్ గా ఏర్పాటు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంక్యుబేషన్ కేంద్రాలుగా ఈ ఆర్ఎస్వీ కేంద్రాలు పనిచేయనున్నాయి. ఆర్టీఐహెచ్ తో కలిసి కియా ఇండియా సంస్థ అడ్వాన్స్డ్ ప్రోటో టైపింగ్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. వివిధ స్టార్టప్ లకు చేయూత ఇచ్చేలా హై ఎండ్ ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్ ప్రోటోటైపింగ్ ఫెసిలిటీని కియా ఏర్పాటు చేయనుంది. డీప్ టెక్ స్టార్టప్ లకు ఆర్ధిక సహకారం అందించేలా ఆర్టీఐహెచ్ తో కలిసి సిడ్బీ రూ.20 కోట్ల సీడ్ ఫండ్ ప్రోగ్రామ్ ను కూడా ప్రారంభించనుంది.
దీనికి సంబంధించి సిడ్బీ బ్యాంక్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో 1 లక్ష మంది ఎంఎస్ఎంఈ డిజిటల్ మెచ్యూరిటీ అసెస్మెంట్ లో భాగంగా వివిధ కళాశాలల్లో 50 డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ - ఐటీ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. వీటితో పాటు వెయ్యి ఎంఎస్ఎంఈ ఎనర్జీ, వాటర్ ఆడిట్స్, ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ లో డయాగ్నాస్టిక్స్ నిర్వహించేందుకు ఎస్సెల్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 750 ఎంఎస్ఎంఈలతో పాటు 3,125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రూ.200 కోట్ల వ్యయంతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టాలని నిర్ణయించారు. దివ్యాంగ యువతకు ఎంట్రప్రెన్యూర్ షిప్ ట్రైనింగ్ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టనున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లకు ఎంస్ఎంఈ ఉత్పత్తులు
రాష్ట్రంలోని 10 ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో ఆయా రంగాల్లో జరిగే వృద్ధిని అధ్యయనం చేసేందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరంతో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. రూ.1 లక్ష ఎంఎస్ఎంఈలకు టెక్నాలజీ అడాప్షన్ తో పాటు డిజిటల్ రెడీనెస్ పై శిక్షణ కోసం వోడా ఫోన్ ఐడీయా బిజినెస్ తో ఒప్పందం కుదిరింది. ఎంఎస్ఎంఈల్లో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ కోసం జోహో సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు తయారు చేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలకు, ఎగుమతులకు చేయూతనిచ్చేలా అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ తో ఒప్పందం కుదిరింది.
లాజిస్టిక్స్ సపోర్టుతో పాటు క్రాస్ బోర్డర్ ట్రేడ్, ఎగుమతుల సామర్ధ్యం పెంచేలా ఆరామెక్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 1 లక్ష మంది మైక్రో ఎంటర్ ప్రైజెస్ సామర్ధ్యాలను పెంచేలా మెటా సంస్థ చేయూత అందించేందుకు ఒప్పందం చేసుకుంది. తయారవుతున్న ఉత్పత్తుల నాణ్యత సర్టిఫికేషన్, గ్లోబల్ ప్రమాణాలతో ఉత్పత్తి తదితర అంశాల్లో సహకారం అందించేందుకు క్యూసిఐ ముందుకు వచ్చింది. ఎంఎస్ఎంఈ సంస్థల్లో నేషనల్ పెన్షన్ వ్యవస్థ అమలు, ఆర్ధిక వ్యవహారాలు, సామాజిక భద్రత అంశాల్లో తోడ్పడేందుకు పీఎఫ్ఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, డీబీవీ స్వామి సహా ప్రజాప్రతినిధులు, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ సీఈఓ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు



.webp)


