చంద్రబాబును కూడా ఇరుకున పెట్టిన రాయపాటి.. టీడీపీ నేతలు ఫైర్..

posted on: Jan 11, 2016 3:43PM

టీడీపీ నేత.. నర్సారావు పేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ గురించి కామెంట్లు చేసి సొంత పార్టీ ఎంపీతోనే తిట్టుంచుకున్న పరిస్థితి ఏర్పడింది. తుఫాన్లు వస్తే కొట్టుకుపోయే విశాఖకు రైల్వే జోన్ ఎందుకని రాయపాటి కామెంట్ చేయగా.. దానికి ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించి.. తుఫాన్ల పేరుతో వచ్చే రైల్వేజోన్లు కూడా రాకుండా చేస్తారా.. ఏం మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. అది అయిపోయిందో లేదో ఇప్పుడు మరో విషయంపై కూడా అలానే వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత అయిన చంద్రబాబును సైతం ఇరుకున పెట్టేలా వ్యాఖ్యనించారు రాయపాటి.

సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గుంటూరు వెళ్లిన సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి.. రాయపాటి మిత్రులు కావడంతో రాయపాటి వారిని తన ఇంటికి ఆహ్వానించి విందు ఇచ్చారు. ఇక్కడి వరకూ బానే ఉంది. దీని తరువాత మీడియాసమావేశంలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే.. కేంద్ర ప్రభుత్వం నుండి తమకు అనుకున్నంత సహకారం అందడంలేదని.. రాష్ట్రానికి నిధులివ్వడం లేదని రాజధానికీ సొమ్ములు కేటాయించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగకుండా పరిస్థితులు ఇలానే కొనసాగితే తాము భవిష్యత్తులో వామపక్షాలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంటుందా? అని ప్రశ్నించగా ' భవిష్యత్తు పరిణామాలపై త్వరలో సీఎం చంద్రబాబు మాట్లాడతారు. ఏం జరుగుతుందో చూస్తుండండి' అని బాబును ఇరికించారు. దీంతో టీడీపీ నేతలు రాయపాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా రాయపాటి వ్యాఖ్యలపై సుధాకర్ రెడ్డి మాత్రం కౌంటర్ ఇచ్చినట్టు సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. మేము చాలా కాలం నుండి మిత్రులం కాబట్టి తాను పిలవగానే విందుకు వచ్చాను కాని అంతకుమించి ఇంకా రాజకీయ ప్రాధాన్యత ఏం లేదని అన్నారు. ఇంకా పొత్తు గురించి రాయపాటి చేసిన వ్యాఖ్యలకు గాను.. బీజేపీతో టీడీపీ పొత్తు ఉన్నంతకాలం తాము కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గతంలో టీడీపీ తో కలిసి పనిచేశాం.. కానీ గత ఏడాది మాత్రం చంద్రబాబు బీజేపీతో పొత్తు ఏర్పాటు కుదుర్చుకున్నారు.. అయినా పొత్తు గురించి ఇప్పుడే మాట్లాటడం అనవసరమని అన్నారు.

మరి బీజేపీ-టీడీపీ మిత్రపక్షాలైనప్పటికీ వారి మధ్య అప్పుడప్పుడు విబేధాలు తలెత్తుతూనే ఉన్నాయి. బీజేపీ నేత కన్నా ఇటీవలే టీడీపీ నేతలపై మండిపడ్డారు. మరి ఇప్పుడు రాయపాటి చేసిన వ్యాఖ్యలకు ఒకపక్క టీడీపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మరి బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ముఖ్యంగా చంద్రబాబు రాయపాటి వ్యాఖ్యలకు ఎలా రియాక్ట్ అవుతారో.. చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...