Latest News

ఎంపీకి డ్రగ్స్ పాజిటివ్...పాత ట్వీట్ వైరల్

posted on: Mar 15, 2026 11:49AM

 

హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పట్టుబడటంతో గతంలో ఆయన  చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.  గత వైసీపీ పాలనలో డ్రగ్స్ ఓవర్‌డోస్ వల్ల 2017 మంది చనిపోయారని చెబుతూ మీ ఓటు ఏపీలో డ్రగ్స్‌ను అడ్డుకోగలదు అని ఆయన పోస్ట్ చేశారు. తీరా ఇప్పుడు ఆయనే డ్రగ్స్ కేసులో దొరికిపోవడంతో నెటిజన్లు ఆ ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

 డ్రగ్స్‌ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూరిన్‌ టెస్ట్‌ విషయంలో ఎంపీ పుట్టా మహేష్‌ నాటకం ఆడినట్లు తేలింది. యూరిన్‌ శాంపిల్‌ బదులు నీళ్లు ఇచ్చారు. అనుమానం రావడంతో శాంపిల్ బాటిళ్లను టెస్టు చేయగా..శాంపిల్‌ బాటిల్‌లో ఉంది యూరిన్‌ కాదని వాటర్ అని గుర్తించారు. దీంతో ఎంపీ పుట్టాపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. టెస్టులు కోసం యూరిన్‌ శాంపిల్‌ ఇవ్వాలని.. నీళ్లు కాదని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌పై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పుట్టా మహేష్‌ నుంచి యూరిన్‌ సేకరించి టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో ఎంపీ పుట్టా మహేష్‌ బ్లడ్‌ టెస్టులో పాజిటీవ్‌గా నిర్ధారణైంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...