చెల్లెలు కవితకు అన్నయ్య పవన్ థ్యాంక్స్...

 

కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి మోడీ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో ఏ ఒక్కరినీ అడిగినా చెబుతారు. ఇక మోడీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చూపింటిన మొండిచేయిని చూసి జనాలు రగిలిపోతున్నారు. మరో పక్క టీడీపీ ఎంపీలు మా రాష్ట్రానికి న్యాయం చేయండిరా బాబు అంటూ పార్లమెంట్ లోపల, బయట కూడా నిరసనలు చేస్తూ తమ బాధను చెబుతున్నారు. ఇక ఏపీ ఎంపీల బాధను చూసిన కాంగ్రెస్ కూడా మా మద్దతు మీకు ఇస్తున్నాం అని తమ మద్దతు ఇప్పటికే తెలిపింది. పాపం ఈ రకంగా అయినా రాష్ట్రాన్ని విభజించి చేసిన పాపానికి కాస్త అయిన ప్రాయశ్చితం చేసుకోవాలని చూస్తున్నట్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు ఇంకా పలు పార్టీలు కూడా ఏపీకి అండగా ఉంటామని ముందుకు వచ్చాయి. అందులో తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి. ఆ పార్టీ ఎంపీ కవిత రాజ్యసభలో ఏపీకి ఇచ్చిన విభజన హామీలన్నీ నెరవేర్చాలని... ఏపీ టీడీపీ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుందని.. అంతేకాదు జై ఆంధ్ర అని కూడా అన్నారు ఆమె.

 

ఇప్పుడు కవిత ఇచ్చిన మద్దతుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించి.. అన్నవరంలోని అన్నయ్య పాత్ర పోషించాడు. తన ట్విట్టర్ ద్వారా... 'రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై పార్లమెంటులో మాట్లాడిన చెల్లెలు కవిత గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా' అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరి గతంలో పవన్ తెలంగాణ పర్యటన చేయడం... పర్యటనలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒక్క మాట కూడ అనకపోవడ... ఆతరువాత పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందని కవిత చెప్పడం... ఇప్పుడేమో కవితను పవన్ చెల్లెలు అనడం చూస్తుంటే.. రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో....