కానిస్టిట్యుయెన్సీల పై కవిత కామెంట్స్ కి కారణం ఏంటి?

posted on: Aug 20, 2016 5:48PM

 

టీఆర్ఎస్ , బీజేపి మధ్య సాన్నిహిత్యం పెరుగుతోందా? ఈ అనుమానం ఇప్పటిది కాదు. గత కొన్ని రోజులుగా చాలా మందికి కలుగుతున్నదే. అందుకు తగ్గట్టే సంకేతాలు కూడా వస్తున్నాయి. రీసెంట్ గా ప్రధాని తెలంగాణ పర్యటన సందర్భంగా కూడా రెండు పార్టీల చనువు స్పష్టంగా కనిపించింది.

 

తాజాగా టీఆర్ఎస్ ఎంపీ కవిత తెలంగాణలో నియోజక వర్గాల సంఖ్య పెరుగుతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరో చోటా మోటా నాయకులు ఈ మాటంటే లైట్ తీసుకోవచ్చుగాని స్వయాన సీఎం కూతురు, నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారంటే దాదాపూ ఖయమన్నట్లే. కాని, ఒక్కసారి మనం కొన్నాళ్లు వెనక్కి వెళితే ఇదే నియోజక వర్గాల పెంపు అంశం ఆంధ్రప్రదేశ్ విషయంలో చర్చకొచ్చింది. అప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ఏమాత్రం స్పందిచినట్టు కనిపించలేదు. అధికార టీడీపీ ఎన్డీఏలో భాగమైనప్పటికీ ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. కొన్నాళ్లు న్యూస్ లో నానిన  కానిస్టిట్యూయెన్సీల పెంపు మ్యాటర్ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయింది.

 

మారుతున్న పరిణామాల నేపథ్యంలో టీడీపీ, టీఆర్ఎస్ దగ్గరవుతున్నాయి. ఈ కొత్త స్నేహం కారణంగానే నియోజక వర్గాల పెంపుకి ఢిల్లీలో గ్రీన్ సిగ్నల్ వచ్చి వుండవచ్చు. అందుకే, కవిత స్థాయి నాయకురాలు నియోజక వర్గాలు పెరుగుతాయని ప్రకటించారు. అదే నిజమైతే అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు 50 వరకూ అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజక వర్గాలు పెరిగే ఛాన్స్ వుంది. ఇక తెలంగాణలో అదే రేషియోలో దాదాపు 30వరకూ అసెంబ్లీ సీట్లు పెరగవచ్చు.

 

ఎంపీ, ఎమ్మేల్యేల సీట్లు, టీఆర్ఎస్, బీజీపీల పొత్తు ఇవేవీ ఇంకా కన్ ఫర్మ్ కాకున్నా కవిత లేటెస్ట్ కామెంట్స్ ఎంతో కొంత భవిష్యత్ సూచించేవే అంటున్నారు అబ్జర్వర్స్.... 

google-ad-img
    Related Sigment News
    • Loading...