Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్
posted on: Jul 16, 2026 6:53PM

ఆషాఢ మాస బోనాల పండుగ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమైన అనంతరం ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి బోనాన్ని కుమ్మర సమాజానికి చెందిన మహిళలు గోల్కొండ జగదంబ మహంకాళి అమ్మవారికి సమర్పించడం వందల ఏళ్లుగా కొనసాగుతున్న గొప్ప ఆనవాయితీ అని చెప్పారు.
గోల్కొండలో తొలి బోనం సమర్పించిన తర్వాతే లష్కర్ బోనాలతో పాటు హైదరాబాద్ నగరంలోని ప్రతి గల్లీ, ప్రతి ఇంట్లో బోనాల వేడుకలు ప్రారంభమవుతాయని, అనంతరం గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ ఉత్స వాలు వైభవంగా జరుగుతాయని వివరించారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతూ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిందన్నారు.
బోనం సమర్పించే ప్రతి భక్తుడు "అమ్మా... పిల్లలను, పెద్దలను, మమ్మల్ని చల్లగా చూడు.. అందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వ దించు" అని ప్రార్థిస్తారని తెలిపారు. సకాలంలో వర్షాలు కురిసి పాడిపం టలు సమృద్ధిగా పండాలని, రైతులు, వ్యాపారులు, ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకుంటారని చెప్పారు.
ఎన్ని శతాబ్దాలు గడిచినా ఈ సంప్రదాయాన్ని భావి తరాలకు సజీవంగా అందించాలనే లక్ష్యంతో గోల్కొండ బోనాల జాతరను ఘనంగా నిర్వహి స్తున్నారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో కుమ్మర సోదరులు, వివిధ వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఈ ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని కొనియాడారు. అనంతరం తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియ జేస్తూ, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.






