Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బోయినపల్లి మార్కెట్లో ఎంపీ ఈటల రాజేందర్ ధర్నా
posted on: Mar 28, 2026 3:14PM

బోయినపల్లి మార్కెట్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్త, పారిశుధ్య సమస్యలపై ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాకు దిగారు. దీంతో శనివారం బోయనపల్లి మార్కెట్ లో ఒకింత ఉద్రిక్తత నెలకొంది. మార్కెట్ లో పారిశుద్ధ్య సమసయ పూర్తిగా పరిష్కారం అయ్యే వరకూ ధర్నా వీడేది లేదని ఈటల అల్టిమేటమ్ ఇచ్చి ధర్నాకు కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ నగరానికి ప్రధాన కూరగాయల సరఫరా కేంద్రం అయిన బోయినపల్లి కూరగాయల మార్కెట్ అపరిశుభ్రతకు నిలయంగా మారింది. నిత్యం వేలాది మంది రైతులు, కార్మికులు, వ్యాపారులు రాకపోకలు సాగించే ఈ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా చెత్త తొలగించకపోవడంతో మార్కెట్ ప్రాంగణమంతా చెత్త కుప్పలతో నిండిపోయింది. వాటి నుంచి వస్తున్న తీవ్రమైన దుర్గంధంతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీనికి తోడు నిన్న రాత్రి కురిసిన వర్షానికి వర్షపు నీరు చెత్తతో కలిసిపోవ డంతో బురదనీళ్లు కూరగాయలు అమ్మే ప్రాంతాల వరకూ చేరాయి. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. కీలకమైన మార్కెట్‌లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ.. సమస్యను ఈటల దృష్టికి తీసుకువెళ్లారు.
దాదాపు పాతికేళ్లుగా బోయన్ పల్లి మార్కెట్ హైదరాబాద్ మహానగరానికి కూరగాయల సరఫరాదారుగా ఉంటోంది. ఈ మార్కెట్ ను రోజూ పది వేల మందికి పైగా వినియోగదారులు కూరగాయల కోనుగోలు కోసం వస్తారు. వీరు కాకుండా వేల సంఖ్యలో వాహనాలు, వ్యాపారులు, కార్యికులు ఉంటారు. ఏటా 15 కోట్లకు పైగా ఆదాయం ఈ మార్కెట్ ద్వారా వస్తున్నది. అయితే బోయనపల్లి కూరగాయల మార్కెట్ లో గత తొమ్మిది నెలలుగా తీవ్ర పారిశుధ్య సమస్య విలయతాండవం చేస్తోంది. చెత్త తొలగింపు కాంట్రాక్టర్లు, టాయిలెట్లు శుభ్రం చేసే కార్మికులకు చెల్లింపులు జరగకపోవడంతో వందల లారీల చెత్త అక్కడ పేరుకుపోయింది.
మార్కెట్ లో పారిశుద్ధ్య లోపం వ్యాధులకు కారణమౌతోందని స్థానికులలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ లో పారిశుద్ధ్య సమస్య కారణంగా కస్టమర్లు ఈ మార్కెట్ కు రావడం తగ్గించేశారు. దవీంతో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్‌లో నిర్మించిన వాటర్ ట్యాంక్‌లో నీరు లేకపోవడం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం సమస్యను మరింత తీవ్రమయం చేశాయి. తాను వస్తున్నానని తెలిసి తాత్కాలికంగా బ్లీచింగ్ పౌడర్ చల్లడం తప్ప ప్రభుత్వం నుంచి శాశ్వత చర్యలు లేవని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఆ సమస్య పరిష్కారమయ్యే వరకూ తన ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే మార్కెట్ ను రెండు మూడు రోజుల పాటు బంద్ చేసి పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఈటల డిమాండ్ చేశారు.






