పసిబిడ్డను కాల్చి చంపిన కసాయి తల్లి

posted on: Feb 24, 2026 5:58PM

 

కన్నతల్లి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది.. వారికి ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా విలవిల్లాడుతుంది. అలాంటి అమ్మ మాతృత్వానికే మచ్చ తీసుకొచ్చిన హృదయ విదారకమైన ఘటన హైదరాబాదు నగరంలో చోటుచేసుకుంది. ఓ కన్న తల్లే తన రెండు నెలల పసికందును అమానుషంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది... కూలీలుగా పనిచేస్తున్న దంపతుల కుటుంబంలో ఈ దారుణం జరిగింది. బీహార్‌కు చెందిన రాజేందర్, మమత ప్రేమ వివాహం చేసుకుని సంవత్సరం క్రితమే జీవనోపాధి నిమిత్తం హైదరాబాదు నగరానికి వచ్చి బౌరంపేట్ ఔటర్ రింగ్ రోడ్ సమీపం లోని స్పీడ్ సానరెల్లి అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తూ..జీవనం ప్రారంభించారు. 

వీరికి రెండు నెలల శిశువు ఉంది. ఈరోజు మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో డయల్‌– 100కు సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకు న్నారు. ప్రాథమిక దర్యాప్తు లో భాగంగా తల్లి మమత, శిశువు ఏడవకుండా నోటిలో గుడ్డలు కుక్కి, కాళ్లకు తాడుతో కట్టేసినట్లుగా గుర్తించారు. అనంతరం శిశువు మృతి చెందిన తర్వాత కట్టెల పొయ్యిలో వేసి కాల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే  ఏసీపీ శంకర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని ఆ ప్రాంతాన్ని క్షుణంగా పరిశీలిస్తూ ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. 

శిశువును ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఘటన జరిగిన భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్‌ అమ్మకాలు తగ్గిపోతాయనే కారణంతోనే మీడియాను లోపలికి అనుమతించలేదని తెలిసింది.పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి  తరలించామని, కసాయి తల్లి మమతను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించామని ఏసీపీ శంకర్ రెడ్డి వెల్లడించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...