చర్లపల్లి సెంట్రల్ జైల్లో బండి భగీరథను కలిసిన తల్లి అపర్ణ, బంధువులు

posted on: May 18, 2026 9:17PM

 

చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఉన్న బండి భగీరథను ఆయన తల్లి అపర్ణతో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఈరోజు కలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో బండి భగీరథ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు   తరలించిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఈ కేసులో తాజాగామరో కొత్త సెక్షన్ నమోదు చేశారు. 

ఇదిలా ఉండగా మరోవైపు జైల్లో ఉన్న కుమారుడిని కలుసుకునేందుకు తల్లి బండి అపర్ణ ఈరోజు చంచలగూడ జైలుకు వచ్చారు. జైలు అధికారుల అనుమతితో  ఈ భేటీ జనరల్ బారక్‌లో జరిగింది. సుమారు గంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో కుటుంబ సభ్యులు బండి భగీరథతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితి, జైలు లోని పరిస్థితుల గురించి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా తల్లి అపర్ణ తన కుమారుడితో భావోద్వేగంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం వారు జైలు నుంచి బయలుదేరారు. జైలు అధికారులు సాధారణ నిబంధనల ప్రకారం ఈ భేటీని అనుమతించినట్లు సమాచారం
 

google-ad-img
    Related Sigment News
    • Loading...