Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉదయం పించన్ల పంపిణీ.. సాయంత్రం కోదండరామస్వామికి పట్టు వస్త్రాల పంపిణీ
posted on: Mar 31, 2026 5:56PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నెల్లూరు, కడప జిల్లాల్లో బుధవారం (ఏప్రిల్ 1)పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు ఆయన సామాజిక పింఛన్ల పంపిణీ, ఒంటిమిట్ట సీతారాముల కల్యాణమహోత్సవంలో సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలుత బుధవారం (ఏప్రిల్ 1) ఉదయం నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందిస్తారు. అనంతరం ఆయన నేరుగా కడప జిల్లా ఒంటిమిట్టకు వెళ్లి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సంధర్భంగా సీతారాముల వారికి సతీసమేతంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలను సమర్పిస్తారు.
బుధవారం ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11 గంటలకు సీఎం చంద్రబాబు వింజమూరు చేరుకుంటారు. వింజమూరులోని ఉత్తర ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీని చేసి, లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పాతూరు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొంటారు.
అనంతరం ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని సాయంత్రం నాలుగు గంటల 25 నిముషాలకు ఒంటిమిట్ట చేరుకుంటారు. ఆరున్నర గంటలకు గంటలకు కోదండ రామస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం సతీమణి భువనేశ్వరి పాల్గొంటారు. ఒక బుధవారం రాత్రి ఒంటిమిట్టలోనే బస చేస్తారు.


.webp)



