Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రశాంత వాతావరణంలో బీబీ-కా-ఆలం ఊరేగింపు నిర్వహణకు సీపీ పిలుపు
posted on: Jun 12, 2026 9:04PM
.webp)
పవిత్ర మొహర్రం మాసంలో అషూరా సందర్భంగా షియా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే చారిత్రాత్మక బీబీ-కా-ఆలం మాతం ఊరేగింపును ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహిం చేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వ యంతో పనిచేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సాలర్ జంగ్ మ్యూజియం ఆడిటో రియంలో సీపీ సజ్జనర్ అధ్యక్షతన మొహర్రం ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షియా కమ్యూనిటీ మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఊరేగింపు డబీర్‌పురాలోని బీబీ-కా-ఆలం అషూర్ ఖానా నుంచి ప్రారంభమై ఎత్తేబార్ చౌక్, కోట్ల అలిజా, పంజేశా, మీరాలం మండి, చార్మినార్, గుల్జార్ హౌస్, పురానీ హవేలీ, దారుషిఫా మీదుగా సాగి చాదర్‌ఘాట్ లోని మజీద్-ఎ-ఇలాహి వద్ద ముగుస్తుందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను అమలు చేయడంతో పాటు, తగిన వాహన పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తు న్నట్లు చెప్పారు. శాంతిభ ద్రతల పరిరక్షణ కోసం రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు అదనపు పోలీస్ బలగాలను మోహరిస్తు న్నామని వెల్లడించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం నిఘా నిర్వహిస్తాయని పేర్కొ న్నారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకో కుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీపీ స్పష్టం చేశారు.
ఊరేగింపులో పాల్గొనే ఏనుగు భద్రత, సంరక్షణపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. ఏనుగును ముందుగానే నగరానికి తీసుకువచ్చి తగిన విశ్రాంతి కల్పించాలని, ఊరేగింపు సమయంలో దాని చుట్టూ బఫర్ జోన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొ నేందుకు జూలాజికల్ పార్క్ ఆధ్వర్యంలో పశువైద్య బృందం, ట్రాంక్విలైజర్‌ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మొత్తం ఊరేగింపు మార్గాన్ని సీసీ కెమెరాల ద్వారా బంజా రాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఉమ్మడిగా పర్యవేక్షిస్తారని తెలిపారు. సమావేశంలో షియా కమ్యూనిటీ ప్రతినిధులు లేవనెత్తిన రోడ్ల మరమ్మతులు, విద్యుత్ వైర్ల క్రమబద్ధీకరణ, తాగునీటి సరఫరా, పారిశుధ్యం తదితర సమస్యలను జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖల సమన్వ యంతో తక్షణమే పరిష్క రిస్తామని సీపీ హామీ ఇచ్చారు.


.webp)



