Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మొయినాబాద్ ఫామ్ హస్: అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు..ఇప్పుడు డ్రగ్స్ పార్టీ
posted on: Mar 15, 2026 10:58AM

మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అదే ఫామ్ హౌస్.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం తో మరోసారి తెరమీదకు వచ్చింది.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే ఫామ్ హౌస్ లో అప్పటి ఫిర్యాదుదారుగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు సోదాలు నిర్వహిస్తే.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీ గురించిన విశ్వసనీయ సమాచారంతో ఈగల్ టీమ్ మెరుపు దాడి నిర్వహించి రోహిత్ రెడ్డితో సహా 11 మందిని అరెస్టు చేసింది.
ఇప్పుడు స్వయంగా రోహిత్ రెడ్డి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలారు. గతంలో రోహిత్ రెడ్డి పోలీసులకు సహకరించిన అదే ఫామ్ హౌస్ లో, ఈసారి రోహిత్ రెడ్డి సమక్షంలోనే పోలీసులపై కాల్పులు జరిగాయి. ఒకే ఫామ్ హౌస్ గతంలో రాజకీయ కుట్రలకు వేదికగా, ఇప్పుడు డ్రగ్స్ పార్టీలను చిరుమానాగా ఉండటం గమనార్హం. గతంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వస్తే, ఇప్పుడు ప్రముఖ రాజకీయ నేతలు, ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల సమక్షంలో డ్రగ్స్ పార్టీకి వేదికగా మారడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో జరిగిన ఘటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటే.. ఇప్పుడు క్రిమినల్ యాక్టివిటీలో ప్రముఖుల ప్రమేయం ప్రాధాన్యతాంవంగా ఉంది.


.webp)



