Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...డ్రగ్స్ కేసు ఆరుగురికి పాజిటివ్....ఈగల్ టీం ఎస్పీ గిరిధర్
posted on: Mar 15, 2026 12:07PM

హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. డ్రగ్స్ వినియోగంపై నిర్వహించిన పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ వెల్లడించారు. పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ టెస్టుల్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు రితేష్‌రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిలకు పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. రాత్రి నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో ఎంపీ పుట్టా మహేశ్‌కు నెగిటివ్ వచ్చినప్పటికీ, అనంతరం చేసిన బ్లడ్ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఎస్పీ పేర్కొన్నారు.
ఇక ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫామ్ హౌస్‌ను సీజ్ చేయాలని అధికారులు నిర్ణయించారు. చేవెళ్ల ఆర్డీవో నేతృత్వంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. సిపి యాక్ట్ ప్రకారం ఫామ్ హౌస్‌ను సీజ్ చేయనున్నట్లు సమాచారం. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పాటు ఈ ఫామ్ హౌస్‌లో తరచుగా డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తులు, పార్టీల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై విచారణ సాగుతోంది.



.webp)


