Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోహన్ నాయక్ కు 14 రోజుల రిమాండ్
posted on: Jun 10, 2026 12:16PM

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు మోహన్ నాయక్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారా?, ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా అక్రమంగా సంపాదించారా? అనే కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
మోహన్ నాయక్ పై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లుగా పలు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి మోహన్ నాయక్ నివాసంతో పాటు కార్యాల యం కలిపి మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ స్థాయిలో నగదు లావాదేవీలకు సంబంధించిన డాక్యు మెంట్లు, స్థిరాస్తుల పత్రాలు, బ్యాంకు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఈ సోదాలలో మోహన్ నాయక్ సుమారు 200 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు.


.webp)
.webp)


