ప్రధాని చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. ఎప్పుడంటే..?

posted on: Jul 20, 2026 3:32PM

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రంగానికి  కీలకమైన విజయనగరం జిల్లాలోని అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది.  ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం ఏర్పాట్లలో నిమన్నమయ్యాయి. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ..  భోగాపురం  గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని రికార్డు వేగంతో  పూర్తి అయ్యింది.

ఇక గత కొన్ని వారాలుగా, ప్రధాని మోడీకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చెబుతూ వస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి తేదీన భోగాపురం రానున్నారు.  

ప్రధాని  రాక సందర్భంగా..  భోగాపురం సమీపంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు.   60 ఎకరాల విస్తీర్ణంలో భారీ సభా ప్రాంగణాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నంచీ పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో..  ట్రాఫిక్, శాంతి భద్రతలకు సంబంధించి పటిష్టమైన ప్రణాళికతో యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.  మూడు వేలకు పైగా వాహనాలకు సరిపోయేలా ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. భారీ వర్షాలు కురిసినా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రహదారుల పునర్నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థల పటిష్టతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

మోడీ పర్యటన, సభ కోసం..  రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీలు స్వయంగా భోగాపురం సభా ప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరుకానున్న దృష్ట్యా..  నిబంధనలకు అనుగుణంగా భద్రతను నాలుగు  సెక్టార్లుగా  విభజించారు. శాంతిభద్రతల పరిరక్షణ, జనసమూహాల నిర్వహణ, ప్రొటోకాల్ అమలులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా  విస్తృత  చర్యలు చేపట్టారు.  విఐపీల రాకపోకలు, ప్రజల రాకకు వేర్వేరు మార్గాలను కేటాయించి రవాణా మార్గాలను సుగమం చేస్తున్నారు. 

Prime Minister Narendra Modi,  visit to Andhra Pradesh,  CM Chandrababu Naidu, Development of North Andhra, Bhogapuram Greenfield Airport 

google-ad-img
    Related Sigment News
    • Loading...