అండర్ 19 వరల్డ్ కప్ విజయం.. భారత యువజట్టుపై మోడీ ప్రశంసల వర్షం
posted on: Feb 7, 2026 10:35AM

అండర్-19 ప్రపంచకప్‌లో చారిత్రక విజయం సాధించిన యువ భారత జట్టుపై ప్రధాని మోడీ ప్రశంల వర్షం కురిపించారు. జట్టు సభ్యులకు అభినందనలు తెలుపుతూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన పోస్టులో ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందన్నారు.
అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మన యువ జట్టును చూసి దేశం మొత్తం గర్వపడుతోందన్నారు. టోర్నమెంట్ ఆసాంతం అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా లేకుండా కప్ గెలిచిన యువ భారత్ జట్టు ఆటగాళ్లు అద్భుత ప్రతిభ కనబరిచారని మోడీ పేర్కొన్నారు. అలాగే ఈ చారిత్రక విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, భారత టి20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తదితరులు అభినందనలు తెలిపారు. సచిన్ టెండూల్కర్ అయితే 14 ఏళ్ల సూర్యవంశీ అద్భుత ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పొగడ్తల వర్షం కురిపించాడు.



.webp)


