Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మళ్లీ మెలోడీ మ్యాజిక్!
posted on: May 20, 2026 3:11PM

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా చివరి దశలో ఇటలీ రాజధాని రోమ్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో మోదీ జరిపిన తాజా సమావేశం అంతర్జాతీయ దౌత్య ప్రాధాన్యతతో పాటు సోషల్ మీడియాలో సరికొత్త సంచలనానికి వేదికైంది. ప్రధాని మోదీ ఇటలీ ప్రధానికి భారతదేశానికి చెందిన ప్రముఖ ‘మెలోడీ’ టాఫీలను అంటే మెలోడీ చాక్లెట్లను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటతెగ వైరల్ అవుతోంది.
ద్వైపాక్షిక చర్చలకు ముందు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో మోదీ మెలోనికి ఒక ప్యాకెట్ మెలోడీ చాక్లెట్లను బహుమతిగా అందించారు. దీనిపై ఇటలీ ప్రధాని స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఒక ప్రత్యేక వీడియో పంచుకున్నారు. అందులో ఆమె స్పందిస్తూ ప్రధాని మోదీ మాకోసం ఎంతో రుచికరమైన మెలోడీ టాఫీలను గిఫ్ట్‌గా తెచ్చారు అని నవ్వులు చిందిస్తూ.. "ధన్యవాదాలు చెప్పారు.
గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా వేదికల్లో మోదీ, మెలోని పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన మెలోడీ (‘#Melodi’) అనే ట్రెండ్‌ను ఈ తాజా సంఘటన మరోసారి గుర్తుకు తెచ్చింది. భారతదేశంలో దశాబ్దాలుగా ఎంతో ఆదరణ పొందిన పార్లే సంస్థకు చెందిన మెలోడీ చాక్లెట్ల స్లోగన్ ఆధారంగా నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. దౌత్యపరమైన ఈ సరదా సన్నివేశం ఇరు దేశాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రోమ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీకి అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజం నుండి కూడా ఘన స్వాగతం లభించింది. ఇటలీ ప్రధాని మెలోని ఏర్పాటు చేసిన అధికారిక విందులో పాల్గొన్న మోదీ, అనంతరం ఆమెతో కలిసి రోమ్‌లోని చారిత్రాత్మక కొలోసియం కట్టడాన్ని సందర్శించారు.


.webp)
.webp)


